తెలంగాణ
Kavitha: జూబ్లీహిల్స్ కోసమే అజార్‌కు మంత్రి పదవి

Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీ రాగం అందుకుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు లక్ష్మన్, శ్రీధర్‌బాబు అభివృద్ధిపై దృష్టిపెట్టడం లేదని కవిత విమర్శించారు. కరీంనగర్ ఎయిర్పోర్ట్ గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నట్లు కవిత అభిప్రాయపడ్డారు.



