సినిమా

Singer Chinmayi: అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు

Singer Chinmayi: సోషియల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతోందని ప్రముఖ సింగర్ చిన్మయి కంప్లైంట్‌ చేశారు. ఆన్ లైన్‌లో చాటింగ్ చేస్తూ తనని దూషిస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు సింగర్ చిన్మయి ఫిర్యాదు చేశారు. తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆన్ లైన్ ద్వారా సీపీకి ఫిర్యాదు చేశారు.

చిన్మయి భర్త నిర్మాత రాహుల్ రవీంద్రన్ వారి వివాహంలో, మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది చిన్మయి ఎంపిక అని చెప్పిన ఒక కోట్‌పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు. తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సింగర్ చిన్మయి ఫిర్యాదును సీపీ సజ్జన్నార్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button