Narasaraopet: తక్కువ ధరకే బంగారం.. రూ. 25 లక్షలతో పరార్!

Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలకు టోకరా వేశారు దుండగులు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడుదాం రమ్మని శ్రీ గణేష్ అనే వ్యక్తిని పిలిచారు కేటుగాళ్లు. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్లాడు. అనంతరం అక్కడికి రాగనే ముందు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటూ అతడ్ని బురిడీ కొట్టించారు.
ఈ నేపథ్యంలోనే పోలీస్ దుస్తులు, జీపులో వచ్చిన మోసగాళ్ళు నగదు బ్యాగ్ చెక్ చేయాలని చెప్పి బ్యాగ్ తీసుకుని సినీఫక్కీలో పారిపోయారు కేటుగాళ్లు. ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బాధితుడు నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్రుడు నరేష్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.



