జాతియం

Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కిపైనే నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారి తీస్తోంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతీ ఇంట్లో ఒకరు అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలోని దాదాపు 75 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తెలిపింది.. ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌ నుంచి దాదాపు 15వేల కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button