తెలంగాణ
ఆసిఫాబాద్‌లో కల్తీ స్వీట్స్ అమ్మకాలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు లేక కాలం చెల్లిన పాడైపోయిన ఆహార పదార్థాలను అమ్మి స్వీట్ హౌజ్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి స్వీట్ హౌజ్‌లో ఓ వ్యక్తి స్వీట్స్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తన పాపకు ఇచ్చాడు. స్వీట్ తిన్న పాప కాసేపటికి అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడంతో షాపు నిర్వాహకుడిని ప్రశ్నించాడు బాధితుడు.
దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు లేక ఆహార పదార్థాల్లో కల్తీ చేసి విచ్చలవిడిగా జరుగుతుందని అధికారులు స్పందించి నాణ్యత పాటించని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.



