ఇమ్రాన్ హష్మీ షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రంలో విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ స్టేట్మెంట్ సంచలనం రేపింది. చాలామంది నటులు సెట్స్‌కు రారని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన నటనకు, పాత్రకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. చిత్రం రిలీజ్ అనంతరం ఇమ్రాన్ బాలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారారు. అయితే ఆయన నుంచి వచ్చిన ఒక షాకింగ్ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలామంది నటులు సెట్స్‌కు ఆలస్యంగా వస్తుంటారనే చర్చలో, కొందరు లేట్‌గా రావడం పక్కన పెడితే అసలు చాలామంది సెట్స్‌కు రారని ఇమ్రాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో, ఆ నటులు ఎవరనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇమ్రాన్ ఈ స్టేట్మెంట్‌తో ఇండస్ట్రీలో కలకలం రేపారు.



