సినిమా

రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ కమింగ్!

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఫస్ట్ సింగిల్ నవంబర్‌లో విడుదల కానుంది. నిర్మాత విశ్వప్రసాద్ దీనిపై స్పష్టత ఇచ్చారు. థమన్ సంగీతం అద్భుతంగా ఉంటుందట.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా రూపొందుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అని అభిమానులు ఆత్రంగా ఉన్నారు.

నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ‘మోగ్లీ’ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. మొదటి సింగిల్ నవంబర్ 5న విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధ్ధి కుమారి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button