ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వార్

ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం హీట్ రాజేస్తుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉండే తిరువూరు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన పోస్టుతో ఎన్టీఆర్ జిల్లాలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయా?. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి తల నొప్పిగా మారనుందా..?మొన్నటి వరకు ఎమ్మెల్యేకి ఆ ఎంపీ దేవుడు,కానీ ఇప్పుడెందుకు దెయ్యం అయ్యాడు..? సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే పెట్టిన ఆ స్టేటస్,ఎంపీ స్టేటస్ ని దిగజార్చే విధంగా ఎందుకు అయ్యింది..? కొలికపూడి, కేశినేని మధ్య బహిరంగ విమర్శల తీరుపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది..?లెట్స్ వాచ్ దిస్ స్టోరీ….

గత కొంత కాలంగా తిరువూరు టీడీపీలో ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఉన్న కోల్డ్ వార్ పూర్తి స్థాయిలో డైరెక్ట్ ఫైట్ గా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేనిపై చేసిన పోస్టు సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో ఎంపీకి రూ.5 కోట్ల నగదు ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన బ్యాంక్ లావాదేవీల స్క్రీన్ షాట్స్ ను ఎమ్మెల్యే కొలికపూడి మీడియాకు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న వార్ డైరెక్ట్ ఫైట్ గా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని అంతే ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి నగదును ఆశించే స్థితిలో లేనని తేల్చి చెప్పారు.

కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య మాటల యుద్ధం కాస్తా బ్యాంకు లావాదేవీల వరకు వెళ్లింది. 2024 ఎన్నికల్లో కేశినేని చిన్నికి విడతల వారిగా 5 కోట్లు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలతో సహా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఈ ఒక్క స్టేటస్ తో తెలుగు తమ్ముళ్ళ మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి.బ్యాంకు ద్వారా కేశినేని చిన్నికి అలాగే ఎంపీ పీఏ మోహన్ కి నగదు బదిలీ చేశానని ఎమ్మెల్యే కొలికపూడి ఘటైన వ్యాఖ్యలు చేసారు.

నిజం గెలవాలి నిజమే గెలవాలి అంటూ స్టేటస్ ల తో ఎమ్మెల్యే మరింత పదునైన మాటలతో భావోద్వేగానికి గురయ్యారు.ఎంపీ కేశినేని చిన్నికి ఇచ్చిన నగదుపై వచ్చే ఎపిసోడ్ లో చర్చించుకుందామంటూ ఉత్కంఠ రేకేత్తించి కామాతో ముగించారు. దీంతో గత కొంత కాలంగా తిరువూరు టీడీపీలో ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఉన్న కోల్డ్ వార్ పూర్తి స్థాయిలో డైరెక్ట్ వార్ గా మారింది.

తిరువూరు టీడీపీ నాయకత్వంలో వర్గ పోరాటం ఇప్పటిది కాదు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గంగా టీడీపీ క్యాడర్ చీలిపోయింది. దీనిపై గతంలో పార్టీ హైకమాండ్ పిలిపించి మాట్లాడడం జరిగింది. పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేసింది కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో వచ్చిన విబేదాలపై ఒక కమిటీ ని అధిష్టానం ఏర్పాటు చేసింది.

వారంతా కూడా తిరువూరులో స్థానిక టీడీపీ నేతల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించి పార్టీ అధిష్టానానికి పంపించారు.అయితే ఆ నివేదిక అనంతరం కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ మాములే అన్నట్టుగా ఆ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టేసారు. వివాదాలు సర్దుమణిగినప్పడికి తాజాగా తెరపైకి మరొకసారి రావడంతో అధిష్టానానికి తల నొప్పిగా మారుతుంది.

తిరువూరు టీడీపీలో తముళ్ల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంటుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.తనపై ఆరోపణలను జనం నమ్మరంటూ కొలికపూడి వ్యాఖ్యలను ఎంపీ కేశినేని చిన్ని తిప్పికొట్టారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దగ్గరి నుంచి ఎలాంటి నగదును ఆశించే స్థితిలో లేనని తేల్చి చెప్పారు. అంతేకాదు తన సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు.

ఒక ప‌ని మొద‌లు పెడితే కాంప్రమైజ్ అయ్యే నాయ‌కుడిని కానని,తన జేబులో డ‌బ్బుతో విజ‌య‌వాడ ఉత్స‌వ్ నిర్వ‌హించ‌టం జ‌రిగిందని కేశినేని చిన్ని అన్నారు. గ‌త నాలుగేళ్లుగా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో సేవా కార్య‌క్ర‌మాల‌కు ఎన్నో కోట్ల రూపాయలు ఖ‌ర్చు పెట్టానని కేశినేని చిన్ని మీడియా ముఖంగా తెలియచేసారు. 5 ల‌క్ష‌లు, 10 ల‌క్ష‌లు తీసుకున్నానని ఎవ‌రో ఆరోప‌ణ‌లు చేస్తే ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేరని ఎంపీ తిప్పి కొట్టారు.

తానేంటో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌లందరికీ తెలుసని ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ‌ానికి చెందిన పలువురు నేతల ఆర్థిక ప‌రిస్థితి ఎంటో అంద‌రికీ తెలుసని,వాళ్లంతా పార్టీలో క‌ష్ట‌పడి ప‌దవులు సంపాదించుకున్నారని ఎంపీ వివరించారు. విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు సాక్ష్యాలు చూపించాలని ఎంపీ సవాలు విసిరారు.విజయవాడలో కూర్చుని మండ‌లాధ్య‌క్ష‌లను డిక్లేర్ చేసింది ఎవ‌రో అంద‌రికీ తెలుసని, డిక్లేర్ చేసిన వ్యక్తి తీసుకున్నారేమో తెలియ‌దని విమర్శించారు.

ఎవ‌రు అవినీతికి పాల్ప‌డినా, ఇసుక అక్ర‌మ ర‌వాణా చేసినా తెలుగుదేశం పార్టీ క్ష‌మించ‌దని ఎంపీ చిన్ని చురకలంటించారు. గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో వైసీపీ నాయ‌కులు చేసిన స్కామ్స్ అన్నీ బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఈ స్కామ్స్ వెనుకున్న నాయ‌కుడు ఎవ‌రో కూడా త్వరలో బ‌య‌టికి వ‌స్తారని కేశినేని చిన్ని అన్నారు. మొత్తానికి తిరువూరు పంచాయతీ అధిష్టానానికి చేరింది. మరి అంతర్గత విబేదాలను అధిష్టానం ఏవిధంగా పరిష్కరించిద్దో వేచి చూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button