తెలంగాణ

కొండన్నపల్లిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండన్నపల్లి గ్రామానికి చెందిన తొరికొండ మల్లయ్య తన కుటుంబంతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మల్లయ్య మృతి చెందాగా ఆయన భార్య, అత్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనదారుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇమ్రాన్ ఖాన్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button