తెలంగాణ

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి..

ఆన్‌లైన బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరోజ్‌గూడలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఆశిష్(22) అనే యువకుడు బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌లో డబ్బులు పెట్టి ఆడుతున్న సంగతి తండ్రి శ్రీనివాస్‌కు తెలిసింది. దీంతో తండ్రి శ్రీనివాస్ పలు మార్లు కొడుకును మందలించి అప్పులు తీర్చినా ఆశిష్ తన ప్రవర్తన మార్చుకో లేదు.

ఈ క్రమంలోనే మరోసారి కొడుకును మందలించగా మనస్తాపానికి గురైన ఆశిష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button