తెలంగాణ
Harish Rao: హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి

Harish Rao: హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల పైకి బుల్డోజర్లు వస్తాయని అందుకే హైడ్రా బంద్ కావాలంటే మాగంటి సునీతమ్మను గెలిపించాలని ప్రజలకు సూచించారు. లేదంటే ఇళ్లను ధ్వంసం చేసిన తననే గెలిపించారని రేవంత్ రెడ్డి మరిన్ని ఇళ్లను ధ్వంసం చేస్తారని హరీష్ రావు ఆరోపించారు.



