ఆంధ్ర ప్రదేశ్సినిమా
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నూతన వధూవరులు నార్నే నితన్ శివాని దంపతులతో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు.
అలాగే బాలీవుడ్ సినీ నిర్మాత ఎక్తా కపూర్, కృతి శెట్టి, దర్శకుడు వెంకీ కుడుముల వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీని ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదలు అందజేశారు ఆలయ అధికారులు.



