ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న సీఐఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ తో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రూ.84 వేల కోట్లతో విశాఖలో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, చంద్రబాబు, నారా లోకేష్ ల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరగనుంది. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 13వ తేదీ ఉదయం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి పయనమవ్వనున్నారు.



