జాతియం
Himachal Pradesh: ఘోర ప్రమాదం.. బస్సుపై విరిగిపడిన కొండచరియలు.. 15 మంది మృతి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో 15మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 30మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.



