తెలంగాణ
చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడిసరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీమ్. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్‌కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు.



