ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మునోత్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి పదార్ధాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 70 నుంచి 80 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.



