ఆంధ్ర ప్రదేశ్
అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా టీటీడీ పాలకమండలి తీరు ఉందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. టీటీడీ పాలకవర్గం, అధికారులు హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా అపచారాలు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు.



