Mohan Bhagwat: హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

Mohan Bhagwat: భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోంది. మనపై ముస్లింలు ఎన్ని దాడులు చేసినా… ఎన్ని సవాళ్లు విసిరినా… వారితో కలిసే ఉంటున్నాం. వారిని ఐక్యం చేసుకోవాలని చూస్తున్నాం. ఈ క్రమంలోనే… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి ముస్లింలు, క్రైస్తవులు ఒకప్పటి హిందూవులేనని అన్నారు.
హిందూవులు లేకపోతే.. ప్రపంచానికే ఉనికి ఉండదని ఉద్ఘాటించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుకున్న అర్థం ఏంటి..? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు..?
జాతుల మధ్య ఘర్షణల తర్వాత తొలిసారిగా మణిపూర్‌లో పర్యటించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం మనుగడపై మాట్లాడిన ఆయన.. హిందువులు ఉనికి కోల్పోతే.. ప్రపంచానికే ఉనికి ఉండదని ఉద్ఘాటించారు. దేశ నిర్మాణానికి ఆర్థిక బలం చాలా అవసరమని, మన ఆర్థిక వ్యవస్థ ఎవరిపైనా ఆధారపడకుండా స్వావలంబన సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలు మణిపూర్ సంక్షోభం, ప్రభుత్వ స్వదేశీ విధానం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. హిందూ సమాజమే ప్రపంచాన్ని నిలబెట్టడానికి కేంద్రమని ఆయన ఉద్ఘాటించారు.
మణిపూర్‌లోని ఒక కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోహన్ భగవత్ హిందూ సమాజం అమరమైనది అని నొక్కి చెప్పారు. భారతదేశ నాగరికత గ్రీస్, ఈజిప్ట్, రోమ్ వంటి సామ్రాజ్యాలన్నింటికంటే ఎక్కువ కాలం మనుగడ సాగించిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందన్నారు. యనాన్, మిశర్, రోమా వంటి నాగరికతలన్నీ భూమండలం నుంచి అంతరించిపోయాయన్నారు.
కానీ మన నాగరికతలో ఏదో ఉందని అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నామని భగవత్ అన్నారు. కానీ భారత నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచి ఉందని మోహన్ భగవత్ గుర్తుచేశారు. ప్రపంచంలోని ప్రతీ దేశం ఎన్నో రకాల పరిస్థితులను చూసింది. కానీ మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. హిందూ సమాజం అమరమైనదని అని ఆయన వివరించారు.
భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని పేర్కొన్న భగవత్ ప్రపంచ ధర్మాన్ని కాపాడే సంరక్షకులుగా హిందూ సమాజాన్ని అభివర్ణించారు. మన సమాజంలో మనం నిర్మించుకున్న బలమైన వ్యవస్థ కారణంగా హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. హిందువులు లేకపోతే ప్రపంచం అంతం కావడం ఖాయమని ఆయన అన్నారు. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మోహన్ భగవత్ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి.
అలాగే హిందూ సమాజాన్ని ధర్మానికి గ్లోబల్ కస్టోడియన్‌గా అభివర్ణించారు. భారత్ అనేది ఒక అమర నాగరికత పేరని తెలిపారు. మనం మన సమాజంలో ఒక నెట్‌వర్క్‌ను సృష్టించామని.. దాని కారణంగా హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. హిందువులు అంతరించిపోతే ప్రపంచం కూడా మనుగడలో ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో భారత దేశంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఒకే పూర్వీకుల సంతతి వారని కాబట్టి భారత దేశంలో ఎవరూ నాన్-హిందువులు కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మణిపూర్ సంక్షోభం, జాతి ఘర్షణల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దేశ నిర్మాణానికి మొదటి అవసరం బలం అని చెప్పిన మోహన్ భగవత్ బలం అంటే ఆర్థిక సామర్థ్యం అని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వావలంబన కలిగి ఉండాలని మనం ఎవరిపైనా ఆధార పడకూడదని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ప్రభుత్వం స్వదేశీ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తున్న సమయంలో భగవత్ చేసిన ఈ ఆర్థిక స్వావలంబన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
స్వావలంబన మార్గం కష్టం కాదన్న భగవత్ నక్సలిజం క్షీణతను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. సమాజం దాన్ని ఇంక సహించకూడదని నిర్ణయించుకోవడం వల్లే నక్సలిజం అంతమైందని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంపై జరిగిన స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా ఆయన ఉదాహరణగా చూపారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించేవాడు కాదని కానీ భారత దేశంలో వారి సూర్యుడు అస్తమించడం ప్రారంభించాడని చెప్పారు.
భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు ఒకే పూర్వీకుల వారసులు అని.. వారంతా హిందువుల మూలాలు కలిగిన వారేనని అన్నారు మోహన్ భగవత్. దేశాన్ని నిర్మించడానికి సైనిక సామర్థ్యం, జ్ఞాన సామర్థ్యం రెండు కూడా సమానంగా ముఖ్యమైనవిగా అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.



