తెలంగాణ
అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ అందించారు జిల్లా యంత్రాంగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట విద్యార్థులు పాట పాడి వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు.



