ఆంధ్ర ప్రదేశ్
Nellore: ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విష జ్వరాలు

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గతవారం నుండి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు 40 మంది వరకు జ్వరాల బారిన పడ్డారు వెంటనే విషయాన్ని ఆర్డీవో పావని దృష్టికి తీసుకెళ్లగా మెడికల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు.
మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది విద్యార్థినులకు శానిటైజర్స్ అందించడంతోపాటు పరిసరాలను శుభ్రపరిచారు. అయితే స్కూల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే దోమలతో జ్వరాలు వ్యాప్తిచెందుతున్నాయని ప్రిన్సిపల్ రూత్ తెలిపారు.



