తెలంగాణ
హైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 విద్యార్థులు హర్షం

గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణలో లోపాలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంప పెట్టు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరీక్షను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చినా మరోవైపు ప్రభుత్వం అప్పీల్‌కు పోవాలనుకోవడం పనికి మాలిన చర్య అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానేసి మరోసారి పరీక్షను నిర్వహించాలన్నారు.



