బీజింగ్‌లో పుతిన్‌తో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ

మరోవైపు చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా భారత్–రష్యా సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌తో రష్యా బలమైన బంధం కొనసాగించడం తమకు ఎలాంటి సమస్య కాదని షరీఫ్ స్పష్టం చేయడం విశేషం. భారత్‌తో రష్యా సంబంధాలను మేము గౌరవిస్తామంటూ షరీఫ్ చెప్పడం కూడా సంచలనంగా మారింది.
రెండుదేశాల సంబంధాల విషయంలో తమకేం అభ్యంతరం లేదని తమ కోసం రష్యాను కొన్ని హామీలు కోరుతున్నాయమని ఆయన అన్నారు. పాకిస్థాన్ కూడా రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటోందని షరీఫ్ చెప్పడం విశేషం. పాకిస్తాన్‌తో రష్యా సంబంధం, బలమైన అనుబంధ దక్షిణాసియాలో శుభపరిణామమని ఆయన అన్నారు.
ఇప్పటికే ట్రంప్‌కు నోబుల్ బహుమతికి రిఫర్ చేసిన పాకిస్తాన్, తాజాగా పుతిన్‌ను ఆకాశానికెత్తుతోంది. మొత్తంగా రెండు పడవలపై కాళ్లు పెడుతోంది పాకిస్తాన్. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి 80వ వార్షికోత్సవం సందర్భంగా చైనా నిర్వహించిన భారీ సైనిక ప్రదర్శనలో షరీఫ్ పాల్గొన్నారు.



