అంతర్జాతీయం

Peter Navarro: మోడీ, పుతిన్, జిన్‌పింగ్‌లతో భేటీ కావాడం సిగ్గుచేటు

Peter Navarro: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి నోరు పారేసుకున్నాడు. షాంఘై సహకార సంస్థ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో భేటీ కావడాన్ని ఆయన సిగ్గుచేటుగా అభివర్ణించారు. ప్రధాని మోడీ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు.

రష్యాతో కాకుండా మాతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన త్వరలోనే గ్రహిస్తారని ఆశిస్తున్నామ నవారో అన్నారు. భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌ల బాంబు పేల్చిన నాటి నుంచి పీటర్ నవారో తరచూ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

అమెరికా చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశీయంగా ఇంధన ధరలను అదుపులో ఉంచడం, మార్కెట్‌ను స్థిరీకరించడం కోసమే రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని భారత్ స్పష్టం చేసింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత జీ7 దేశాలు రష్యా చమురుపై బ్యారెల్‌కు 60 డాలర్ల ధరల పరిమితి విధించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button