ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులతో రూపుదిద్దుకున్న గణేశుడు

వినాయకచవితి పండుగ సందర్భంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి విఘ్నాలు తొలగించే గణేషుడు కొలువు కావడం చూస్తుంటాం. కడపజిల్లా పొరుమామిల్లలోని సెయింట్ ఆంటోనీ ఉన్నత పాఠశాలలో యాజమాన్యం విద్యార్థులతో బొజ్జగణపయ్య ఆకారాన్ని రూపొందించారు. పాఠశాలలోని అందరు విద్యార్థులతో కలిపి వినాయకుడి ఆకారంలో కూర్చుని అబ్బురపరిచారు.
విద్యార్థులందరితో కులమతాల కతీతంగా రూపుదిద్దుకున్న గణేశుడి రూపం అందరినీ ఆకట్టుకుంది వినాయక చవితికి ఒక రోజు ముందే సెయింట్ ఆంటోనీ విద్యార్థులు వినాయక సంబరాలను జరుపుకున్నారు.



