సినిమా

Chiranjeevi: విశ్వంభర రిలీజ్ డేట్ లీక్ చేసిన చిరంజీవి..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను చిరంజీవి స్వయంగా షేర్ చేశారు.

‘‘విశ్వంభర ఎందుకు ఆలస్యమవుతుందో అందరికీ సందేహం ఉంది. కానీ ఈ ఆలస్యం సముచితం. ఎందుకంటే సినిమాలో సెకండ్‌హాఫ్ మొత్తం వీఎఫ్‌ఎక్స్‌పై ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యుత్తమమైన అనుభూతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందుకే క్వాలిటీకి ఎటువంటి తగ్గింపు లేకుండా, విమర్శలకు తావివ్వకుండా కష్టపడుతున్నాం.

ఈ సినిమా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ అలరించే చందమామ కథలా సాగుతుంది. ఆగస్టు 21న సాయంత్రం 6.06 గంటలకు గ్లింప్స్ విడుదల చేస్తాం. ఇక 2026 సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చిరంజీవి తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో హీరోయిన్లుగా త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రత్యేక గీతంలో బాలీవుడ్ స్టార్ మౌనిరాయ్ మెరవనున్నారు. వంద మందికిపైగా డ్యాన్సర్లతో చిత్రీకరించిన ఈ పాట, సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటతో థియేటర్‌లో ఎనర్జీ మరింత పెరుగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button