తెలంగాణ
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ

Tirumala: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల కొండా సురేఖ మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.



