ఆంధ్ర ప్రదేశ్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుశం, మన్యం, అల్లూరి, తూ.గో., ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముంది. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button