ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన

విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటించారు. భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. విద్యాధరపురం, బుడమేరు వంతెన, గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితిని మంత్రి పరిశీలించారు.

నాలాలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని కమిషనర్‌కు మంత్రి నారాయణ ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. వచ్చే వర్షాకాలం నాటికి నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button