ఆంధ్ర ప్రదేశ్

తిరుమల గిరుల్లో సరికొత్త అందాలు

Tirumala: శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఓ వైపు మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే మరో వైపు కపిలతీర్థ జలపాతం నుంచి జల ధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిలతీర్థ జలపాతం నుంచి ఉదృతంగా నీరు ప్రవహిస్తుంది.

గత రెండు రోజులుగా తిరుపతిలో కురుస్తున్న వర్షాలతో శేషాచలం అటవీ ప్రాంతంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న మాల్వాడి గుండం జలపాతం భక్తులను అలరిస్తోంది. ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతున్న జలపాతాన్ని చూసేందుకు భక్తులు అక్కడికి వస్తున్నారు. జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో స్నానానికి భక్తులను ఆలయ సిబ్బంది అనుమతించడం లేదు.

కపిలతీర్థం వద్ద జలపాతంలో కొండ నుంచి జోరుగా జారుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఈ జలపాతాన్ని చూసి ఆనందంతో పరవశించిపోతు జలపాతాలను తమ సెల్ ఫోన్ లో బంధించి సెల్ఫీలు, తీసుకుంటు రీల్స్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button