ఆంధ్ర ప్రదేశ్
తల్లిని రోడ్డుపై కొడవలితో నరికి చంపిన కొడుకు

ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. కన్నతల్లిని రోడ్డుపై కొడవలితో నరికి చంపాడు కొడుకు. కొయ్యలగూడెం అశోక్‌నగర్‌లో ఘటన జరిగింది. కొంతకాలంగా తల్లి నరసమ్మను డబ్బుల కోసం వేధిస్తున్నాడు కొడుకు శివ. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కొడవలితో దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరసమ్మ మృతి చెందారు.



