Manoj Manchu : ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ నుంచి సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. బ్రిటీష్ కాలం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం తన 21వ సినిమాగా నిలుస్తుంది. హనుమ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
మంచు కుటుంబం నుంచి వస్తున్న టాలెంటెడ్ హీరో మంచు మనోజ్, తన 21 ఏళ్ల సినీ ప్రయాణంలో 21వ చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి’ అనే ఓ భారీ పీరియాడ్ డ్రామాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంలో 1897 నుంచి 1922 వరకు సాగే కథతో రూపొందనుంది. దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు.
మనోజ్ ఈ సినిమాను తన కెరీర్లో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. వెల్వెట్ సోల్, టూర్ రాడిక్స్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు స్వీకరించాయి. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మంచు మనోజ్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రభావం చూపనుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



