ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం సింగపూర్ టూర్‌పై కేబినెట్లో చర్చించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అభివృద్ధి, భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. కేబినెట్ ముందుకు నాలా చట్ట సవరణ బిల్లు రానుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్పైనా కేబినెట్లో చర్చ జరగనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై కేబినెట్ చర్చించనుంది.



