ఆంధ్ర ప్రదేశ్
ఇండ్లు, పంట పొలాల్లో గజరాజుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా గిరిశిఖర గ్రామాలలో గజరాజుల గుంపు జనావాసాలలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. కురుపాం మండలం నేరేడువలస, దురుబిలి,పెళ్లివలస గ్రామాలలోకి ఏనుగుల గుంపు ప్రవేశించి ఇళ్లపై దాడి చేసి నేలమట్టం చేశాయి.
జరడ పంచాయతీ కొత్తగూడ, నెమలిమానుగూడ, పటాయిగెడ్డ గ్రామాలలోనూ ఏనుగుల గుంపు గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై ఏనుగులు ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాయో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



