ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు

Tirumala: తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి డబ్బు, నగలు విలువైన వస్తువులు దోచుకెళ్ళారు. ఏరియా డామినేషన్ లో భాగంగా 30 మంది సిబ్బందితో అడుగడుగునా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో దొంగలు దోపిడీ చేసి పోలీసులకే సవాల్ విసిరారు. స్థానికులు నివాసం ఉండే డి టైప్ క్వార్టర్స్ 27వ నెంబర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు.

స్థానికంగా వ్యాపారం చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేసరికి చోరీ జరిగిందని మహేంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే చోరీ పోలీసుల తనిఖీలకు ముందు జరిగిందా, తర్వాత జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button