ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్ధించింది. రెండు కేసుల్లో వంశీ బెయిల్ రద్దుకి నో చెప్పింది ధర్మాసనం.
కాగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో రిపోర్టు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కి వాయిదా వేసింది.



