తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh: గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధి ష్టానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోందన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని గుర్తుచేశారు.
నావాడు-నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యకర్తల పని తీరుతోనే 8 స్థానాలు గెలుచుకున్నామని వివరించారు. ఇక వారి ఆలోచన విధంగానే ముందుకు వెళ్లాలని రాజాసింగ్ బీజేపీ అధిష్టాన్ని కోరారు.