సినిమా

Shefali Jariwala: షఫాలీ జరివాలా మృతి.. బాలీవుడ్‌లో విషాదం!

Shefali Jariwala: ప్రముఖ నటి, మోడల్ షఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి అస్వస్థతతో ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతి ధ్రువీకరించారు.

నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మరణించారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆమెను భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం కోసం ఆమె శవాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు.

2002లో ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోతో షఫాలీ ఒక్కసారిగా యువత హృదయాలను కొల్లగొట్టారు. సల్మాన్ ఖాన్‌తో ‘ముజ్సే షాదీ కరోగీ’ చిత్రంలో నటించారు. బిగ్‌బాస్ 13, నాచ్ బలియే 5లో పాల్గొన్న ఆమె, 2014లో నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో ఆమె చేసిన పోస్ట్ ఆమె చివరిదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button