చదువు

AP Holidays 2025 లిస్ట్‌ ఇదే.. మొత్తం 23 సాధారణ సెలవులు.. 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయ్‌..

2025 Andhra Pradesh Public Holidays: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది (2025) సంబంధించిన సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తంగా 44 రోజులు సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం.. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

2025లో మొత్తం 23 సెలవు దినాలుగా పేర్కొంది ప్రభుత్వం. అయితే ఇందులో నాలుగు హాలిడేలు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో కేవలం 19 మాత్రమే ఉద్యోగులకు లభిస్తాయి. అక్టోబర్ 2 గాంధీజయంతి, విజయదశమి రెండు సెలవులు కూడా కలిసిపోయాయి. వీటితోపాటు 21 ఆప్షనల్ హాలిడేలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.


ముందస్తు సమాచారంతో ఐదు సెలవుల దినాలను అధికారులు వాడుకోవచ్చు. ఇందులో కూడా ఈద్-ఈ- గదర్, మహలాయ అమావాస్య ఆదివారం వస్తున్నాయి. మే నవంబర్‌లో ఎలాంటి సెలవులు లేకపోగా.. జనవరి ఏప్రిల్‌, ఆగస్టులో ఎక్కువగా నాలుగు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఏడాదిలో పది నెలల్లో సెలవులు ఉన్నాయి.. రెండు నెలల్లోనే ఎలాంటి సెలవులు లేవు. పూర్తి సెలవుల జాబితాను ఇక్కడ చూడొచ్చు..

2025 ఏపీ సాధారణ సెలవులు

  • భోగి : 13.01.2025 (సోమవారం)
  • సంక్రాంతి : 14.01.2025 (మంగళవారం)
  • కనుమ – 15.01.2025 (బుధవారం)
  • రిపబ్లిక్ డే : 26.01.2025 (ఆదివారం)
  • మహా శివరాత్రి : 26.02.2025 (బుధవారం)
  • హోలీ : 14.03.2025 (శుక్రవారం)
  • ఉగాది : 30.03.2025 (ఆదివారం)
  • ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31.03.2025 (సోమవారం)
  • బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05.04.2025 (శనివారం)
  • శ్రీరామ నవమి : 06.04.2025 (ఆదివారం)
  • బి.ఆర్. అంబేద్కర్ జయంతి : 14.04.2025 (సోమవారం)
  • గుడ్ ఫ్రైడే : 18.04.2025 (శుక్రవారం)
  • ఈదుల్ అజా (బక్రీద్) : 07.06.2025 (శనివారం)
  • మొహరం : 06.07.2025 (ఆదివారం)
  • వరలక్ష్మీవ్రతం : 08.08.2025 (శుక్రవారం)
  • స్వాతంత్ర్య దినోత్సవం : 15.08.2025 (శుక్రవారం)
  • శ్రీ కృష్ణాష్టమి : 16.08.2025 (శనివారం)
  • వినాయక చవితి : 27.08.2025 (బుధవారం)
  • ఈద్ మిలాదున్ నబీ : 05.09.2025 (శుక్రవారం)
  • దుర్గాష్టమి – 30.9. 2025 (మంగళవారం)
  • మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02.10.2025 (గురువారం)
  • దీపావళి : 20.10.2025 (సోమవారం)
  • క్రిస్మస్ : 25.12.2025(గురువారం)

ఏపీ 2025 ఆప్షనల్ సెలవులు

జనవరి 1 న్యూ ఇయర్, జనవరి 13 హజరత్ అలీ జయంతి, జనవరి 27 షబ్ ఎ మేరాజ్, ఫిబ్రవరి 14 షబ్ ఎ బరాత్, మార్చ్ 22 షహాదత్ ఎ హజరత్ అలీ, మార్చ్ 27 షబ్ ఎ ఖద్ర్, మార్చ్ 28 జుమ్మతుల్ విదా, ఏప్రిల్ 10 మహావీర్ జయంతి, ఏప్రిల్ 30 బసవ జయంతి, మే 12 బుద్ధ పూర్ణిమ, జూన్ 15 ఈద్ ఎ గదిర్, జూన్ 27 రధయాత్ర, జూలై 5 మొహర్రం, ఆగస్టు 15 పార్శీ న్యూ ఇయర్, సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య, అక్టోబర్ 9 యాజ్ దహుమ్ షరీఫ్, నవంబర్ 11 కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 24 క్రిస్మస్, డిసెంబర్ 26 బాక్సింగ్ డే ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button