Jagan: కోర్టు తీర్పు సీఎం చంద్రబాబు పెద్ద చెంపపెట్టు

Jagan: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ జారీ చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని అత్యున్నత ధర్మాసనం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహంను కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో కోర్టు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.
కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేయడంపై జగన్ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద చెంపపెట్టు వంటిదని అన్నారు.
అదే విధంగా నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం గట్టిగా బుద్ది చెప్పిందన్నారు. ఈ క్రమంలో కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఊటంకీస్తు ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం, ఏపీ పోలీసులకు, ప్రభుత్వానికి చురకలు పెట్టడం వంటిదన్నారు.