Mangli: ఫోక్ సింగర్ మంగ్లీ FIR కాపీలో కీలక విషయాలు

Mangli: ఫోక్ సింగర్ మంగ్లీ FIR కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. రాత్రి ఒంటిగంట సమయంలో రిసార్ట్పై ఫిర్యాదు వచ్చిందని సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని కంప్లయింట్ వచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ లేదనే విషయాన్ని కూడా తాము గుర్తించినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు.
డ్రగ్స్ టెస్టుల్లో ఒకరు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించమన్న పోలీసులు మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తాగిన ట్లు టెస్టులో తేలినట్లు వెల్లడించారు. అదేవిధంగా మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై అండ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తానికి త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.