సినిమా

Pawan Kalyan: జోరుగా పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో పవన్ త్వరలో జాయిన్ కానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జోరుగా సాగుతోంది. జూన్ 10 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పవన్ జూన్ 12 లేదా 13 నుంచి సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

30 రోజుల పాటు సాగనున్న ఈ షూటింగ్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button