Gamblers: అంచనాలు పెంచేసిన ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్.. సంగీత్ శోభన్ కొత్త అవతారం!

Gamblers: యూత్‌ఫుల్ స్టార్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా ‘గ్యాంబ్లర్స్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రశాంతి చారులింగా హీరోయిన్గా నటిస్తుండగా, కేఎస్కే చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలై, అందరినీ ఆకట్టుకుంది.
సంగీత్ శోభన్ మరోసారి తనదైన శైలిలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ‘గ్యాంబ్లర్స్’ చిత్రంలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సునీత, రాజ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా, కామెడీ, గ్లామర్, మిస్టరీ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ప్రశాంతి చారులింగా హీరోయిన్గా, రాకింగ్ రాకేష్, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ, సినిమా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, సంగీత్ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ మాట్లాడుతూ, వైవిధ్యమైన కథతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందన్నారు. జూన్ 6న నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.