సినిమా

Mirai: ఊహించని రేంజిలో ఆకట్టుకుంటున్న మిరాయ్ టీజర్

Mirai: తేజ సజ్జ హనుమాన్ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ మిరాయ్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

హనుమాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అశోకుడి 9 రహస్య గ్రంథాల చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకుంటుంది. టీజర్‌లో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను విస్మయపరుస్తోంది. తేజ సజ్జ సూపర్ యోధగా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా కనిపిస్తోంది.

గౌర హరి సంగీతం, శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. చైనా-జపాన్ సరిహద్దుల్లో సాగే ఈ కథలో యాక్షన్, ఫాంటసీ, చారిత్రక అంశాల మేళవింపు అద్భుతంగా ఉంది. సెప్టెంబర్ 5న 8 భాషల్లో, 2D, 3D ఫార్మాట్‌లలో విడుదల కానున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button