News
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ..ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్షాలు

Rain Alert: అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతంలోకి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బల్పడి తుఫాన్ గా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అల్ప పీడన ప్రభావం తో దాదాపు 50 నుండి 60 కిలో మీటర్లు వేగం తో ఈదురుగాలులో తో మోస్తరు నుండి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.
గత రెండు రోజులు గా ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ గా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణం గా బీచ్ రోడ్ అంత కూడా పర్యాటకులను ఆకర్షించేలా ఉండదని ప్రజలు అంటున్నారు. ఘాట్ రోడ్ నుండి వచ్చే వారు మంచు కారణం రోడ్ కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు రోజులు ఇదే విధం గా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు.