సినిమా

Bigg Boss 9: బిగ్ బాస్ 9 హోస్ట్‌.. బాలయ్య కాదా?

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోస్ట్‌గా బాలకృష్ణ వస్తారనే రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే, నాగార్జుననే హోస్ట్‌గా ఖరారు చేశారు నిర్వాహకులు. సెప్టెంబర్‌లో షో స్టార్ట్ ఈసారి ఏ ట్విస్ట్‌లు ఉంటాయో చూద్దాం.

తెలుగు బుల్లితెర సంచలన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 9 కోసం అభిమానుల ఆత్రం రోజురోజుకూ పెరుగుతోంది. గత సీజన్లలో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ దక్కించుకుంది ఈ షో. అయితే గత కొంతకాలం నుంచి తాజా షో హోస్ట్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారనే రూమర్స్ జోరుగా సాగాయి.

కానీ, తాజా సమాచారం ప్రకారం, కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా నిర్వాహకులు ఫైనల్ చేశారు. నాగ్ కోట్ చేసిన భారీ రెమ్యూనరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సీజన్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాగార్జున హోస్టింగ్‌తో ఈసారి బిగ్ బాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది? ఈ రియాలిటీ షో ప్రియులకు ఎలాంటి ట్విస్ట్‌లు సమర్పిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button