తెలంగాణ
నామినేషన్ వేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై మాగంటి సునీతకు మద్దతు తెలిపారు.



