సినిమా

Bellamkonda Sai Sreenivas: సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు

Bellamkonda Sai Sreenivas: రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ కారులో తన ఇంటికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ బెల్లంకొండ శ్రీనివాస్‌‌ను అడ్డుకున్నారు.

దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమే గాక అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button