ఆంధ్ర ప్రదేశ్
Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో, సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ, హడ్కో ఒప్పందాలు చేసుకున్నాయి. రాజధాని నిర్మాణానికి హడ్కో 11 వేల కోట్ల రుణాలను మంజూరు చేయనుంది. జనవరి 22 న ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు.