Samantha: బేబీ బంప్‌తో సమంత.. ఫొటోలు వైరల్..

Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో టాలీవుడ్‌ను షేక్ చేసింది సమంత. మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నటిగా ఆమె ఎంతో బిజీగా ఉంటోంది. తాజాగా సమంతకు చెందిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనపడుతోంది. ఫొటోలను చూస్తున్న నెటిజన్లు, అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
నాగాచైతన్యతో విడాకుల తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందంటూ అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. బేబీ బంప్ ఫోటోలతో చూసిన వారంతా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే సమంత బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అసలు విషయం ఏమిటంటే… సమంత నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ఎవరో ఈ ఫొటోలను ఏఐని ఉపయోగించి క్రియేట్ చేశారు. ఇక గతంలో కూడా సమంత ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు సమంత బేబీ బంప్ ఫోటోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వాటిని చూసి షాక్ అవుతున్నారు.



