తెలంగాణ
Harish Rao: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది

విద్యార్థులకు సామాజిక, నైతిక విలువలను ఉపాధ్యాయులు నేర్పించాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని తెలిపారు. సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందన్నారు.
యువత డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారని, చెడు వ్యసనాలపై విద్యార్థులకు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా అధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ పారూక్ హుస్సేన్ పాల్గొన్నారు.



